'మా వాళ్లు బ్రీఫ్డ్ మీ' అన్న మాట దేశమంతా వినలేదా?: విజయసాయి రెడ్డి

  • చంద్రబాబు కలలోకి వచ్చి భయపెడుతున్న కేసీఆర్
  • ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగ
  • ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
  చంద్రబాబు కలలోకి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "పక్క రాష్ట్రం సీఎం కలలోకి వస్తే నిద్రపట్టని భయం మీది చంద్రబాబూ. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన దొంగవు. ‘మా వాళ్లు బ్రీఫుడు మీ’ అన్న మాటల్ని దేశమంతా విన్నది. 18 కేసుల్లో స్టేలు. హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా కేసీఆర్‌తో రాజీ యత్నాలు చేసినోడివి. బతుకంతా మేనేజ్‌మెంటే కదా?" అని అన్నారు.



Go Back to Shorts
Vijay Sai Reddy
India
Chandrababu
KCR
Twitter

More Telugu News